కొంతమంది రాజకీయ శాస్త్రవేత్తలు, ఆర్థిక వేత్తలు, ప్రస్తుత ప్రపంచ గమనాన్ని బట్టి కొన్ని దేశాలను "కొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం" (Newly industrialized country ) అనే కొత్త వర్గంలో భాగంగా పరిగణిస్తారు.
ఈ కొ.పా.దేలు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరుకోకపోయినా, తతిమ్మా అభివృద్ధి చెందుతున్న దేశాల స్థాయిని దాటి చాలా ముందుకు పోయాయి. ఈ కొపాదేల మరో లక్షణం వేగంగా వృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ (ఎగుమతుల ప్రాధాన్యతలో సైతం ). వేగవంతమైన పారిశ్రామికీకరణ, మరో లక్షణం. సామాజికంగా మరో మార్పు, ఉద్యోగాలనిచ్చే పరిశ్రమలు, కర్మాగారాలు, అవి ఉండే పట్టణ ప్రాంతాలవైపు, వలసపోయే గ్రామీణ జనాభా.
వివిధ ఆర్థికవేత్తల అభిప్రాయాల ప్రకారం, "కొత్తగా అభివృద్ధి చెందుతున్న దేశం"గా ఈ క్రింది వాటిని పిలుస్తున్నారు.
ప్రాంతం | దేశం | కొనుగోలు శక్తి (PPP) ఆధారిత జాతీయాదయం (GDP) (బిలియన్ డాలర్లలో, 2011 ప్రపంచ బ్యాంకు) |
కొనుగోలు శక్తి (PPP) ఆధారిత తలసరి జాతీయాదయం (GDP) (బిలియన్ డాలర్లలో, 2011 ప్రపంచ బ్యాంకు) |
ఆదాయంలో అసమానతలు 2008-09 | మానవాభివృద్ధి సూచి (HDI, 2011) | GDP పెరుగుదల శాతం, 2010 | తలసరి GDP పెరుగుదల శాతం, 2008 | Sources |
---|---|---|---|---|---|---|---|---|
ఆఫ్రికా | దక్షిణాఫ్రికా | 555,340 | 10,977 | 63.1 | 0.619 (medium) | 2.78 | 1.29 | |
ఉత్తర అమెరికా | మెక్సికో | 1,659,016 | 15,121 | 48.3 | 0.770 (high) | 5.52 | 0.75 | |
దక్షిణ అమెరికా | బ్రెజిల్ | 2,309,138 | 11,845 | 54.7 | 0.718 (high) | 7.49 | 4.06 | |
ఆసియా | చైనా | 11,316,224 | 8,394 | 45.3 | 0.687 (medium) | 10.3 | 10.4 | |
భారతదేశం | 4,469,763 | 3,703 | 32.5 | 0.597 (medium) | 11.1 | 8.5 | ||
మలేసియా | 447,595 | 15,578 | 46.2 | 0.761 (high) | 7.16 | 2.86 | ||
ఫిలిఫ్ఫైన్స్ | 393,987 | 4,111 | 43 | 0.644 (medium) | 7.6 | 1.97 | ||
థాయ్ లాండ్ | 622,914 | 9,693 | 40 | 0.682 (medium) | 7.8 | 1.84 | ||
ఐరోపా | టర్కీ | 1,288.638 | 17,499 | 39 | 0.699 (high) | 9.0 | -0.34 |
గోల్డ్ మన్ సాచ్ అభిప్రాయం ప్రకారం, 2050నాటికి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు వరుసగా, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం, బ్రెజిల్, మెక్సికోలు.
అర్జెంటీనా, చిలీ, ఈజిప్టు, ఇండోనేసియా , రష్యాలను కూడా కొంతమంది కొపాదేలుగా పేర్కొంటున్నారు.
ఈ కొపాదేలు, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ ధరలకే కార్మికులు లభిస్తున్నారు. ఇది, ఆయా దేశాలకి, తక్కువ ధరకే సేవలనందిచడంలో తోడ్పడుతోంది. "న్యాయమైన వాణిజ్యం" గురించి మాట్లాడేవారి వద్దనుండి, ఇది తరచూ విమర్శలకు గురవుతోంది.
చైనాదేశంలో రాజకీయ స్వేచ్ఛలేకపోవడం, ఇంటర్నెట్ సెన్సార్షిప్పులు, మానవహక్కుల హననాలు సర్వసాధారణం. అదే భారతదేశం పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. భారతదేశ ప్రజలు అపరిమితమైన స్వేచ్ఛని అనుభవిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలోని అసమర్థ ప్రభుత్వాలు, వ్యవస్థలో గూడుకట్టుకుపోయిన అవినీతి విమర్శలకు గురయ్యే వాటిల్లో మొదటివరుసలో ఉంటాయి. దక్షిణ ఆఫ్రికా, జింబాబ్వే నుండి వస్తున్న వలసదారులలో ఇబ్బంది పడితూ ఉంటే, మెక్సికో డ్రగ్స్ వార్లతో ఇబ్బందులు పడుతోంది.