గాబ్రియేల్ బోరిక్

గాబ్రియేల్ బోరిక్ ఫాంట్ (జ.1986 ఫిబ్రవరి 11), చిలీ దేశానికి చెందిన లిబర్టేరియన్ సోషలిస్టు నాయకుడు, రాజకీయ నాయకుడు. అతను 2021 లో జరిగిన చిలీ అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించి అధ్యక్షునిగా ఉన్నాడు. అతను దేశ చరిత్రలో అత్యధిక ఓట్లను సాధించిన అభ్యర్థిగా గుర్తింపు పొందాడు. తద్వారా తన ప్రత్యర్థి అయిన జోస్ ఆంటోనియో కాస్ట్‌ను ఓడించాడు.

అతను చిలీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం అభ్యసించాడు. 2012 లో అతను యూనివర్శిటీ ఆఫ్ చిలీ స్టూడెంట్ ఫెడరేషన్ కు అధ్యక్షునిగా ఉన్నాడు. మాంగలేన్స్, అంటార్కిటిక్ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించిన ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ కు రెండు సార్లు ఎన్నికయ్యాడు.

మూలాలు

  1. Esparza, Robinson (17 November 2011). "Gabriel Boric: El magallánico que quiere desbancar a Camila Vallejo". El Magallanews.cl, Noticias de Punta Arenas y Magallanes (in స్పానిష్). Retrieved 4 August 2015.
  2. Duhalde, David (19 December 2021). "For Chileans, the Choice in Today's Election Is Socialism or Barbarism". Jacobin Magazine. Retrieved 21 December 2021.
  3. Biobio Chile: Boric rompe récords y es el presidente electo con mayor votación de la historia.
  4. El País: La nueva cara de la izquierda en América Latina.
  5. "Nuevo presidente de la FECh se desmarca de "partidos políticos tradicionales" y critica a Gajardo". LaSegunda.com (in స్పానిష్). 7 December 2011. Retrieved 4 August 2015.
  6. "Andrés Fielbaum asume presidencia de la FECh". Terra (in స్పానిష్). Archived from the original on 1 December 2012. Retrieved 4 August 2015.