గ్రీక్ ప్రభుత్వ-రుణ సంక్షోభం (గ్రీస్ ఆర్థికమాంద్యంగా కూడా పిలుస్తారు), యూరోజోన్ లోని నాలుగు సార్వభౌమ రుణ సంక్షోభాల్లో ఒకటిగా 2009 చివర్లో ప్రారంభమైంది, తర్వాతికాలంలో యూరోపియన్ రుణసంక్షోభంగా వాటన్నిటినీ పిలవనారంభించారు. సాధారణ దృక్కోణం ఇది గ్రేట్ రెసిషన్ (గొప్ప ఆర్థికసంక్షోభం) వల్ల ఏర్పడిన సంక్షోభంతో ప్రారంభమైందని భావించినా, ఈ సమస్య గ్రీసులో విస్ఫోటనం కావడానికి వెనుక గ్రీక్ ఆర్థికవ్యవస్థలోని నిర్మాణాత్మక లోపాలతో, దశాబ్దాల నుంచి నెలకొన్న అత్యున్నతస్థాయి నిర్మాణంలోని లోపాలతో కలపడం, స్థూలజాతీయోత్పత్తి స్థాయికి రుణం మించిపోవడం వంటివి మూలకారణాలు. 2009 తుదిలో, పెట్టుబడిదారుల్లో గ్రీస్ కి రుణాలను తీర్చే సామర్థ్యం ఉండదేమోనని, సార్వభౌమ రుణసంక్షోభం తాలూకు భయాలు ఏర్పడ్డాయి.2012లో, గ్రీస్ ప్రభుత్వం చరిత్రలోనే అతిపెద్ద సార్వభౌమ రుణం తీర్చలేని దేశంగా నిలిచింది. జూన్ 30, 2015న గ్రీస్ €1.6 బిలియన్ ఐఎంఎఫ్ రుణం చెల్లింపు చేయలేకపోయిన తొలి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచింది.ఆ సమయానికి, గ్రీసు ప్రభుత్వం €323 బిలియన్ల రుణం కలిగివుంది.