జెన్

జెన్ వనం(గార్డెన్)

జెన్ అనేది 6 వ శతాబ్దంలో చైనాలో చాన్‌గా అభివృద్ధి చెందిన మహాయాన బౌద్ధమత విభాగం. చైనా నుండి, జెన్ దక్షిణాన వియత్నాం, తూర్పున జపాన్, ఈశాన్యాన కొరియాలకు వ్యాపించింది.

జెన్ మధ్య చైనా ప్రాంత పదం 禪 (dʑjen) (పిన్యిన్: చాన్) యొక్క జపనీస్ ఉచ్చారణ నుండి ఉద్భవించింది. ఆ పదం మొట్టమొదట సంస్కృత పదం ధ్యానం నుండి సంగ్రహించినది. జెన్ ముఖ్యంగా బుద్దుడి స్వభావంలోకి అంతర్దృష్టి, రోజువారీ జీవితంలో దాని గురించిన వ్యక్తిగత వ్యక్తీకరణలపై, ఇతరుల లాభం కోసం పనులు చేయడంపైనా లోతుగా దృష్టి పెడుతుంది. అందువల్ల కేవలం సూత్రాలు, సిద్ధాంతాలు తెలుసుకోవడం నిరర్థకమని చెప్తుంది. జెజెన్ అనే ప్రాథమిక మతపరమైన ధ్యానాన్ని అవలంబించడం ద్వారా అవగాహన చేసుకోవడం, సిద్ధుడైన గురువు సాన్నిహిత్యం వంటివి ప్రధానమని తెలుపుతుంది.

జెన్ బోధనలు వివిధ మహాయాన బౌద్ధసిద్ధాంత భావనలు కలిగివుంటుంది. ప్రధానంగా యోగాచార, తథాగత గర్భసూత్రాలు, హుయాన్‌లలోని బుద్ధుని స్వభావం, సంపూర్ణత, బోధిసత్వ ఆదర్శం వంటివాటిపై దీనిలోని మూలసూత్రాలు ప్రభావితమయ్యాయి. ప్రజ్ఞాపరమిత సాహిత్యం, కొద్దిభాగం మాధ్యమిక వాదం కూడా ప్రభావితం చేశాయి.

చరిత్ర

చైనాకు బౌద్ధం వ్యాపించాకా క్రమాంతరాలపై బుద్ధభద్రుడు అనే భిక్షువు సముద్రమార్గంలో చైనా దక్షిణ భాగంలో మత ప్రచారం ప్రారంభించాడు. చైనీయుల ఊహాశక్తి, కావ్యధోరణికి భారతీయుల మనస్సంసయం, ద్యానం జోడించి ఆ బౌద్ధభిక్షువు చైనాలో ధ్యానవాదానికి పునాదులు ఏర్పాటుచేశాడు. ఇదే క్రమంగా బౌద్ధమతంగా తయారయింది.

మూలాలు

  1. Harvey 1995, p. 159–169.
  2. Kasulis 2003, p. 24.
  3. Yoshizawa 2010, p. 41.
  4. Sekida 1989.
  5. Poceski & Year unknown.
  6. Borup 2008, p. 8.
  7. Yampolski & 2003-A, p. 3.
  8. Dumoulin & 2005-A, p. 48.
  9. Lievens 1981, p. 52–53.
  10. Dumoulin & 2005-A, p. 41–45.
  11. రామారావు, మారేమండ (1947). భారతీయ నాగరికతా విస్తరణము (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో.