టైటానిక్ | |
---|---|
దర్శకత్వం | జేమ్స్ కామెరాన్ |
రచన | జేమ్స్ కామెరాన్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రస్సెల్ కార్పెంటర్ |
కూర్పు |
|
సంగీతం | జేమ్స్ హార్నర్ |
నిర్మాణ సంస్థలు | |
పంపిణీదార్లు |
|
విడుదల తేదీs | 1997 నవంబరు 1(టోక్యో) డిసెంబరు 19, 1997 (అమెరికా) |
సినిమా నిడివి | 195 నిమిషాలు |
దేశం | అమెరికా |
భాష | ఆంగ్లం |
బడ్జెట్ | $200 మిలియన్లు |
బాక్సాఫీసు | $2.187 బిలియన్లు |
టైటానిక్ 1997లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ రూపొందించిన ఆంగ్ల చిత్రం. ఈ సినిమాను టైటానిక్ నౌక ప్రమాద నేపథ్యంలో తీశారు. ఈ కథలో నాయకా నాయికలైన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నౌక మొట్టమొదటి ప్రయాణంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి చివరికి ప్రమాదం ద్వారా ఇద్దరూ ఎలా విడిపోయారన్నది ఈ చిత్ర కథాంశం.
1996లో సముద్ర గర్భంలో అన్వేషణ సాగించే బ్రాక్ లవెట్ అనే పరిశోధకుడు, అతని బృందం ఒక నావలో బయలుదేరి టైటానిక్ నావ మునిగిపోయిన ప్రాంతాల్లో దాని అవశేషాలను పరిశీలించి అందులోనుంచి ఒక అరుదైన వజ్ర హారాన్ని వెలికి తీయాలనుకుంటారు. అందులో భాగంగా నావలో వారికి ఒక పేటికలో భద్రపరచబడిన ఒక చిత్రపటం లభిస్తుంది. 1912, ఏప్రిల్ 14లో గీసినట్టుగా ఉన్న ఆ చిత్రంలో కేవలం ఆ వజ్రహారాన్ని మాత్రమే ధరించిన ఒక మహిళ ఉంటుంది. అదే రోజు టైటానిక్ నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. ఆ చిత్రంలో గల మహిళ ప్రస్తుతం రోజ్ డాసన్ కాల్వర్ట్ అనే వృద్ధురాలు. ఆమెను ఆ పడవ లోకి తీసుకుని వస్తారు. ఆమె లవెట్ కు ఆ చిత్రాన్ని గురించి వివరించడం మొదలుపెడుతుంది.
ఈ సినిమా నిర్మాణానికి 200 మిలియన్ డాలర్లు ఖర్చు అయింది.
మొదటి విడుదలే కాకుండా 2012, 2017 లో వచ్చిన విడుదలలన్నీ కలిపి ఈ సినిమాకు అమెరికాలో 659.4 మిలియన్ డాలర్లు ఆదాయం రాగా ఇతర దేశాల్లో 1.528 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. అంటే మొత్తం ఆదాయం 2.187 బిలియన్ డాలర్లు.
{{cite journal}}
: Cite journal requires |journal=
(help) In Sandler & Studlar (1999).
{{cite news}}
: CS1 maint: unfit URL (link)