మిలోస్ ఫోర్మన్ | |
---|---|
జననం | చెకోస్లోవేకియా | 1932 ఫిబ్రవరి 18
మరణం | 2018 ఏప్రిల్ 13 డాన్బరీ హాస్పిటల్, యుఎస్ | (వయసు 86)
జాతీయత |
|
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1953–2011 |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 4 |
సంతకం | |
మిలోస్ ఫోర్మన్ (1932, ఫిబ్రవరి 18 - 2018, ఏప్రిల్ 13) చెక్-అమెరికన్ నాటకరంగ, టివి, సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు, ప్రొఫెసర్. 1968లో యునైటెడ్ స్టేట్స్కు వలస వెళ్ళేముందు తన స్వస్థలమైన చెకోస్లోవేకియాలో పేరు గడించాడు.
మిలోస్ 1932, ఫిబ్రవరి 18న రుడాల్ఫ్ ఫోర్మన్ - అన్నా ఫోర్మనోవా దంపతులకు చెకోస్లోవేకియాలో జన్మించాడు. ఇతని తల్లి 1943లో ఆష్విట్జ్ నిర్బంధ శిబిరంలోనూ, తండ్రి 1944లో మిట్టెల్బౌ-డోరా నిర్బంధ శిబిరంలో హత్య చేయబడ్డారు. దాంతో ఇతని తల్లిదండ్రుల దగ్గరి బంధువులు, స్నేహితుల దగ్గర పెరిగాడు.
1967లో తీసిన ది ఫైర్‌మెన్స్ బాల్‌ను అనే సినిమాను చెకోస్లోవాక్ అధికారులు తూర్పు యూరోపియన్ కమ్యూనిజంపై తీసిన సినిమాగా భావించారు. ఈ సినిమా మొదట్లో ప్రేగ్ స్ప్రింగ్సంస్కరణవాద వాతావరణంలో అతని స్వదేశంలోని థియేటర్లలో ప్రదర్శించబడింది. అయితే, 1968లో వార్సా ఒప్పంద దేశాల దాడి తర్వాత కమ్యూనిస్ట్ ప్రభుత్వంచే నిషేధించబడింది.
ఆ తరువాత చెకోస్లోవేకియాను విడిచి యునైటెడ్ స్టేట్స్కు వెళ్ళి, అక్కడ సినిమాలు తీసి విజయాన్ని సాధించాడు. 1975లో వన్ ఫ్లూ ఓవర్ ది కోకిల నెస్ట్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఉత్తమ చిత్రం, దర్శకుడు, స్క్రీన్‌ప్లే, ప్రధాన పాత్రలో నటుడు, ప్రధాన పాత్రలో నటి మొదలైన ఐదు ప్రధాన అకాడమీ అవార్డులను గెలుచుకొని, ఇన్ని అవార్డులు గెలుచుకున్న రెండవ సినిమాగా నిలిచింది.
1978లో హెయిర్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది 1979 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. 1981లో రాగ్‌టైమ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎనిమిది విభాగాల్లో అకాడమీ అవార్డుకు నామినేట్ అయింది. 1984లో ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత విద్వాంసుడు వోల్ఫ్‌గ్యాంగ్ అమేడియస్ మొజార్ట్ జీవితం ఆధారంగా అమేడియస్ అనే సినిమాను తీశాడు. ఈ సినిమా పదకొండు విభాగాల్లో నామినేషన్ పొంది ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితోపాటు ఎనిమిది విభాగాల్లో అవార్డులు అందుకుంది. 1996లో ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లైంట్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా మరోసారి అకాడమీ అవార్డు నామినేట్ అయ్యాడు.
సంవత్సరం | పేరు | దర్శకుడు | రచయిత | మూలాలు |
---|---|---|---|---|
1960 | మేజిక్ లాంటెర్న్ II | అవును | అవును | |
1964 | ఇఫ్ ఓన్లీ దే ఎయింట్ హాడ్ దెమ్ బ్యాండ్స్ | అవును | అవును | |
ఆడిషన్ | అవును | అవును | ||
1973 | విజన్స్ ఆఫ్ ఐట్ | అవును | కాదు |
సంవత్సరం | పేరు | దర్శకుడు | రచయిత | మూలాలు |
---|---|---|---|---|
1971 | ఐ మిస్ సోనియా హెనీ | అవును | కాదు |
సంవత్సరం | పేరు | దర్శకుడు | రచయిత | మూలాలు |
---|---|---|---|---|
1966 | ఎ వెట్ పెయిడ్ వాక్ | అవును | కాదు |
సంవత్సరం | సినిమా | మూలాలు |
---|---|---|
1953 | ఎ వుమెన్ ఆజ్ గుడ్ ఆజ్ హర్ వర్డ్ | |
1954 | సిల్వర్ విండ్ | |
1986 | హార్ట్ బర్న్ | |
1989 | న్యూ ఇయర్స్ డే | |
2000 | కీపింగ్ ది ఫెయిత్ | |
2008 | చెల్సియా ఆన్ ది రాక్స్ | |
2009 | హెల్ విత్ ఎ ప్రిన్సెస్ | |
2011 | బిలవుడ్ |
సంవత్సరం | పేరు | దర్శకుడు | రచయిత | మూలాలు |
---|---|---|---|---|
1958 | లేటర్నా మాజికా | కాదు | అవును | |
1960 | లాటర్నా మాజికా II | కాదు | అవును | |
1972 | ది లిటిల్ బ్లాక్ బుక్ | అవును | కాదు | |
2007 | ఎ వాక్ వర్త్ వైట్ | అవును | కాదు |
ఇతడు తన సినీ జీవితంలో రెండు అకాడమీ అవార్డులు, మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డెన్ బేర్, బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు, సీజర్ అవార్డు, డేవిడ్ డి డోనాటెల్లో అవార్డు, చెక్ లయన్‌లను గెలుచుకున్నాడు.
సంవత్సరం | అవార్డు | విభాగం | పేరు | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
1976 | అకాడమీ అవార్డులు | ఉత్తమ దర్శకుడు | వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్ | విజేత | |
1985 | అమేడియస్ | విజేత | |||
1997 | ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్ | నామినేట్ | |||
1972 | బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ దర్శకత్వం | టేకింగ్ ఆఫ్ | నామినేట్ | |
ఉత్తమ చిత్రం | నామినేట్ | ||||
ఉత్తమ స్క్రీన్ ప్లే | నామినేట్ | ||||
1977 | ఉత్తమ దర్శకత్వం | వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్ | విజేత | ||
1986 | ఉత్తమ చిత్రం | అమేడియస్ | నామినేట్ | ||
1976 | గోల్డెన్ గ్లోబ్ అవార్డులు | ఉత్తమ దర్శకుడు | వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్ | విజేత | |
1982 | రాగ్‌టైమ్ | నామినేట్ | |||
1985 | అమేడియస్ | విజేత | |||
1997 | ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్ | విజేత | |||
1971 | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ | గ్రాండ్ ప్రిక్స్ | టేకింగ్ ఆఫ్ | విజేత | |
పామ్ డి ఓర్ | నామినేట్ | ||||
1997 | బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ | గోల్డెన్ బెర్లిన్ బేర్ | ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్ | విజేత | |
2000 | మ్యాన్ ఆన్ ది మూన్ | నామినేట్ | |||
సిల్వర్ బేర్ ఉత్తమ దర్శకుడు | విజేత | ||||
1977 | సీజర్ అవార్డులు | ఉత్తమ విదేశి చిత్రం | వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్ | నామినేట్ | |
1980 | హెయిర్ | నామినేట్ | |||
1985 | అమేడియస్ | విజేత | |||
1990 | ఉత్తమ దర్శకుడు | వాల్మాంట్ | నామినేట్ | ||
1976 | డేవిడ్ డి డోనాటెల్లో అవార్డులు | ఉత్తమ విదేశి దర్శకుడు | వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్ | విజేత | |
1980 | హెయిర్ | విజేత | |||
1985 | అమేడియస్ | విజేత | |||
ఉత్తమ విదేశి చిత్రం | విజేత |
సంవత్సరం | శీర్షిక | అకాడమీ అవార్డులు | బ్రిటీష్ అవార్డులు | గోల్డెన్ గ్లోబ్ అవార్డులు | |||
---|---|---|---|---|---|---|---|
నామినేషన్ | విజేత | నామినేషన్ | విజేత | నామినేషన్ | విజేత | ||
1965 | లవ్స్ ఆఫ్ ఎ బ్లోండే | 1 | 1 | ||||
1967 | ది ఫైర్‌మెన్స్ బాల్ | 1 | |||||
1971 | టేకింగ్ ఆఫ్ | 6 | |||||
1973 | విజన్స్ ఆఫ్ ఐట్ | 1 | 1 | ||||
1975 | వన్ ప్లెవ్ ఓవర్ ది కుకూస్ నెస్ట్ | 9 | 5 | 10 | 6 | 6 | 6 |
1979 | హెయిర్ | 2 | |||||
1981 | రాగ్‌టైమ్ | 8 | 1 | 7 | |||
1984 | అమేడియస్ | 11 | 8 | 9 | 4 | 6 | 4 |
1989 | వాల్మాంట్ | 1 | 1 | ||||
1996 | ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్ | 2 | 5 | 2 | |||
1999 | మ్యాన్ ఆన్ ది మూన్ | 2 | 1 | ||||
మొత్తం | 33 | 13 | 27 | 10 | 30 | 14 |
1977లో ఇతనికి యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం వచ్చింది. 1985, 2000 సంవత్సరాలలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు నాయకత్వం వహించాడు. 1988లో సీజర్ అవార్డు వేడుకకు అధ్యక్షత వహించాడు. 2007 ఏప్రిల్ లో జాజ్ ఒపెరా డోబ్రే ప్లేస్నా ప్రోచాజ్కాలో పాల్గొన్నాడు. 1966లో రూపొందించిన టివి సినిమాకు ప్రేగ్ నేషనల్ థియేటర్లో ప్రదర్శించబడింది. దీనికి ఇతని కుమారుడు కుమారుడు పీటర్ దర్శకత్వం వహించాడు.
మిలోస్ ఫోర్మన్ కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎమెరిటస్ ఫిల్మ్ ప్రొఫెసర్ గా పనిచేవాడు. 1996లో గ్రహశకలానికి 11333 ఫోర్మన్ అని ఇతని పేరు పెట్టారు. కవితలు వ్రాసాడు, 1994లో టర్నరౌండ్ అనే ఆత్మకథను ప్రచురించాడు.
మిలోస్ ఫోర్మన్ తన 86 సంవత్సరాల వయస్సులో 2018, ఏప్రిల్ 13న కనెక్టికట్‌లోని వారెన్‌లోని తన ఇంటికి సమీపంలోని డాన్బరీ హాస్పిటల్లో మరణించాడు. అతను కనెక్టికట్‌లోని వారెన్‌లోని న్యూ వారెన్ స్మశానవాటికలో ఖననం చేయబడ్డాడు.
ది మిలోస్ ఫార్మన్ స్టోరీస్ వాన్ ఆంటోనిన్ జె. లిహెమ్ (ISBN 978-1-138-65829-5)