లీనా మేరీ కాల్హౌన్ హార్న్ (1917, జూన్ 30 - 2010, మే 9) అమెరికన్ నర్తకి, నటి, గాయని, పౌర హక్కుల కార్యకర్త. సినిమా, టెలివిజన్, థియేటర్లో నటించిన హార్న్ డెబ్బై సంవత్సరాలపాటు తన కెరీర్ లో నిలిచింది. పదహారేళ్ళ వయసులో కాటన్ క్లబ్ కోరస్లో చేరింది. హాలీవుడ్‌కు వెళ్ళడానికి ముందు నైట్‌క్లబ్ ప్రదర్శనకారిణిగా మారింది.
మానవ హక్కుల కోసం వాదించిన హార్న్, 1963 ఆగస్టులో వాషింగ్టన్లో మార్చిలో పాల్గొన్నది. తర్వాత నైట్‌క్లబ్ నటిగా తిరిగి వచ్చి, మంచి ఆదరణ పొందిన రికార్డ్ ఆల్బమ్‌లను విడుదలచేసింది. టెలివిజన్ కార్యక్రమాలలో నటించింది. 1980, మార్చిలో తన రిటైర్మెంట్ను ప్రకటించింది. బ్రాడ్వే నాటకరంగంలో 300 కంటే ఎక్కువ నాటకాలలో నటించింది.
లీనా హార్న్ 1917, జూన్ 30న బ్రూక్లిన్‌లోని బెడ్ఫోర్డ్-స్టూయ్వేసంట్లో జన్మించింది.
సినిమాలు
ది డ్యూక్ ఈజ్ టాప్స్ (1938)
క్యాబిన్ ఇన్ ది స్కై (1943)
థౌజండ్స్ చీర్ (1943)
ఐ డూడ్ ఇట్ (1943)
స్వింగ్ ఫీవర్ (1943)
బూగీ-వూగీ డ్రీమ్ (1944)
బ్రాడ్వే రిథమ్ (1944)
స్టూడియో విజిట్ (1946)
టిల్ ది క్లౌడ్స్ రోల్ బై (1946)
జిగ్‌ఫెల్డ్ ఫోలీస్ (1946)
డచెస్ ఆఫ్ ఇడాహో (1950)
మీట్ మి ఇన్ లాస్ వెగాస్ (1956)
ది హార్ట్ ఆఫ్ షో బిజినెస్ (1957)
ది విజ్ (1978)
స్ట్రేంజ్ ఫ్రేమ్ (ఆర్కైవ్ ఫుటేజ్, 2012)
టెలివిజన్
ఎడ్ సుల్లివన్ షో ( 1957 జనవరి 6)
ది జూడీ గార్లాండ్ షో ( 1963 అక్టోబరు 13)
పెర్రీ కోమో షో ( 1965 మార్చి 5)
సెసేమ్ స్ట్రీట్ (ఎపిసోడ్ #5.1, 1973 నవంబరు 19)
శాన్ఫోర్డ్ & సన్ ("ఎ విజిట్ ఫ్రమ్ లీనా హార్న్", #2. 1973 జనవరి 12)
ది ముప్పెట్ షో (1976)
సెసేమ్ స్ట్రీట్ (ఎపిసోడ్ #7.76, 1976 మార్చి 15)
ది కాస్బీ షో ("క్లిఫ్స్ బర్త్ డే" 1985 మే 9)
ఎ డిఫరెంట్ వరల్డ్ ("ఎ రాక్, ఎ రివర్, ఎ లీనా" 1993 జూలై)
మరణం
హార్న్ 2010, మే 9న గుండెపోటుతో మరణించింది. తను సభ్యురాలుగా ఉన్న న్యూయార్క్‌లోని పార్క్ అవెన్యూలోని సెయింట్ ఇగ్నేషియస్ లయోలా చర్చిలో అంత్యక్రియలు జరిగాయి.